Moon on New Moon day

“వేదవద్వీరనార్యాణం సుబ్బయార్యమమాత్మజః
వీర భోజోద్భవం పక్షే దైవఙ్ఞాభీష్ట సిద్ధయే.
త దేవానందబ్రహ్మోక్త సిద్ధాంతే నకరో మ్యహం
భానుమత్యనుసారేణ రుద్రాందానాంతు లక్షణం
గజవేదనవాంభోధీ కలివర్షగతే భువిః
ప్లవంగాబ్దే భానుబింబం కంకణాకార ముచ్యతే.
ప్లవంగే ద్విత్రిగ్రహణాః సూర్యాచంద్రమసో క్రమాత్
ఇమే పంచగ్రహణాశ్చ కృష్ణవేణ్యాశ్చ దక్షిణే.
యమే సూర్య గ్రహే కించిత్ దృశ్యాదృశ్యో భవే త్తతః
యమే చతుస్యా గ్రహణాం కృష్ణవేణ్యా ముదగ్దిశి.
జనానాం సర్వదేశానాం సంఙ్ఞార్థం గురుమహే వయమ్
అయ మాదిత్యమధ్యే తు సవ్యస్యం కంకణాకృతిః
సేతు వేషార్థయో ర్మధ్యే కాశీ శ్రీరంగదేశయోః
భిన్న కంకణరూపస్యాం కుంభకోణే రవే ర్వపుః
గౌతమీ నర్మదా మధ్యే భిన్నకంకణ ముచ్యతి
తస్యా ఉదీచిదిగ్భాగే కాశీ వింధ్యాద్రయో రపి
అస్మిన్ శ్రీశైలదేశే తు కంకణాకార ముచ్యతి
శేషాద్రి గౌతమీ మధ్యే ఉదయో దివి దృశ్యతి.
ప్లవంగే పంచగ్రహణే సూర్యాస్తు వలయాకృతిః
తన్మధ్యే విష్ణురూపస్యాత్ తద్భక్తానాం ప్రియావపమ్”

Subbaraya Kalagnanam

భానుబింబమందు విష్ణు రూపము చూచి
భక్తులు సంతుష్టు లయ్యేరుమా
పూని పౌర్ణమి నాడు అమావాస్య అయ్యీని
పూల వర్షములు గురిసీనిమా

Govinda Vakyam No. 286, Veera Brahmendra Swamy.

వీర భోగ వసంతరాయలు భూలోకానికి వచ్చే కాలమందు పుట్టే కార్యాలు అమావాస్యనాడు చంద్రోదయమయ్యీని. పుష్పముల వాన కురిసీని.”

Kalagnana Soujanya Patrika No.1

“ఈరీతిన సూర్యమండల మందు చంద్రుడు అంతా ప్రవేశించి యుండును. చుట్టూవారా ఎక్కువగా ఉన్న సూర్యబింబము వలయాకృతి అవును. నడుమనున్నటువంటి చంద్రుడు విష్ణురూపంగా అగుపడును. ఇదే అమావాస్య పూర్ణిమ. అనగా సూర్య మండలమందు చంద్రుడు ఉదయించి నాడని తత్త్వవేత్తలచే పలుకబడిన మరుగు మాట. ఇదే అమావాస్య నాడు చంద్రోదయ మయినది అని బ్రహ్మవేత్తలైన వారు తెలుసుకొని సంతోషపడుతున్నారు.”

11th Chapter of Kalagnanam

ప్లవంగ నామ సంవత్సరంలో వచ్చే సంపూర్ణ సూర్యగ్రహణంలో, సూర్యుడు వలయాకృతిలో కనబడుతాడు. ఆ సూర్యబింబం మధ్యలో భక్తులకు అణు సమానమైన, బంగారు వర్ణంలో ప్రకాశించు శ్రీ మహా విష్ణువు దర్శనమిస్తారు. అమావాస్య పౌర్ణముల మధ్య లోకంలోని పుణ్యప్రాణులపై పుష్పవాన కురిపించినట్టుగ బహు కీర్తి పొందుతారు. ఇట్టి రహస్యమైన సూర్యగ్రహణాన్నే పెద్దలు ‘అమావాస్య నాడు చంద్రోదయం‘ అని అన్నారు. ఈ దృశ్యం చుసేనాటికి భూమియందు వీర వసంత రాయలు ఉద్భవించి వుంటారు. ఈ యొక్క రహస్యమైనటువంటి ఈ గ్రహణము భూమియందు దృష్టాంతరం చూచే యెడల లోకానికి విరోధము గలిగేటట్లు పుణ్యాత్ములు వాడుకొందురు. ఇది వీర ధర్మజులు ఉధ్భవము అయ్యేటందుకు హేతువు.

August 02, 2027 AD.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Theme: Overlay by Kaira Kalagnanam
Andhra Pradesh, India