8th Chapter

The following content is from the Veera Brahmendra Swamy Kalagnanam Book 8th Chapter, which is available at Brahmamarimatam. Nothing is touched in this chapter. Its as it is. It is believed to be prophesied by Annajaiah Swamy, the avatar of Lord Brahma at the time of Veera Brahmendra Swamy.

అష్టమాశ్వాసము

             భూలోకాలు మర్త్యలోకాలు మా యథీనం కేదార రామేశ్వర పర్వతం ఏక రాజ్యముగ ఏలుతూ ఉన్నాము. ఆశ్వయుజ దీపావళి అమావాస్య పున్నమి అవుతూ ఉన్నది. కార్తీక శుద్ధలు నాటికి రామధర్మజులు ఉద్భవమవుతూ ఉన్నారు. శుద్ధ సువర్ణమైన మా సేవ చేసుకొని యుండేది. ముర హరుండనే ముక్కంటి మహిమలు మజ్జగత్తులకున్ను తెలియదు. ఈ మనుష్య లోకం ఈలాగున నిర్వంశమై పోతూ ఉన్నది. కార్తిక శుద్ధకే పోతూ ఉన్నది. అందరు నిర్మనుషులై పోయ్యేరు. శ్రీమన్నారాయణుని మహిమ అప్పుడు గాని తెలియదు. దేశాల మీద చోరజనులెల్లా నెల్లికాయపీచు వలెనే అనావృష్టి దోషం తగులవలెను. ఆసనాన గండ మాలపుండ్లు వీపున రాచపుండ్లు, రోమ్మున గండమాల పుండ్లు, నెత్తిన పెడతటి పుండ్లు. ఈ ఆరు వ్యాది రూపాల చేత, పేరాముదపుగింజ చిట్టినట్లుగా, అమావాస్య పున్నమ జూచి నాశనమై పోయ్యేరు. ఇది ఆదిగురి వచన మహిమ, కార్తికమే నివ్చయమని నా మహిమ తెలుసుకొని యుండేది. నా మీద భక్తి లేని వారు అవశ్యం నష్టమై పొయ్యేరు.

శ్లో: మాస కార్తిక మేకం తు సర్వం మాసాత్మమే మయం

వేదాంత సూక్ష్మగీతానాం శ్రీమా మాయుష్యం భవ

మాస మాశ్వీజమేకం తు సర్వమేకమే మయం

అమావాస్య చంద్ర మేకం తు ఆది వీరకాలమే మయం

అడ్డపున్నమ విశ్రాంతం ఆదిత్య మండలం మయం

విష్ణు వీరదర్శనం చైవ వీరధర్మజ కాలమయం.

              మా శాల్మికులైన వారికి మా మహిమ తెలియదు. కార్తీక శుద్ధల నాటి ఉద్భవ మయ్యేము. ముందర పుట్టే కార్యాలు

 • వేద ఘోషణ లోకాల కెల్ల వినబడీని.
 • పువ్వుల వాన గురిసీని.
 • ఆమీదట అమావాస్యనాడు చంద్రోదయ మయ్యీని.
 • సూర్య నందిని ఉద్భవ మయ్యేము.
 • తూర్పున శిరస్సుగాను, పడమట తోక శిరస్సు బండి కల్లంత వెడల్పు తోక ఇరవై బారల పొడవు. ఈ తీరున గల ధూమకేతువు పుట్టి ముప్పై మూడు దినాలు లోకానకెల్ల కానబడీని.
 • ఆ మీదట పుణ్యాత్ములైన వారికి సూర్య మండల మందు మనుష్య రూపంబులు కాన వచ్చేని.
 • ఆకాశము ఎర్ర నయ్యీని, అయ్యయ్యో అనే ధ్వని వినబడీనీ. ఆకాశాన భుగుళ్ళు భుగుళ్ళు మనే ధ్వని వినబడీని.
 • కేశవ నామాలు వినబడీని.
 • ఆవులు ఆకాశం చూచి అరచీని.
 • గ్రామంతరాల పట్నాంతరాల నెత్తురు వర్షం గురిసీని.
 • పట్నాల లక్ష్మీదేవి యెడ్చీని.
 • రామధర్మజులు సూర్యమండల మందు ఉద్భవమయ్యీని.
 • సూర్యనందిని ప్రకాశమయ్యీని.
 • వీర యోగి వస్తూ ఉన్నాడని భూమి పలకీని, వేదాంతం చదివీని.
 • దేవునిమీద ఆకాశము ఉండి అంతర గంగోదకం కురిసీని.
 • సముద్రాలు ఉప్పొంగీని, వాద్యాల చప్పుళ్ళు వినబడీని.
 • సూర్యనందిని అయిదు దినాలుండి భూమి మీద ప్రకాశమయ్యీని.

ఆమీదట మూడు బ్రహ్మ కల్పాలు పూర్వము ధర్మము ఎట్లా నడుచునో ఆ తీరున ముందర నడిపిస్తూ ఉన్నారము. నానావర్ణాదులయందున్న సజ్జనులైన వారు ఎవరున్నారు వారిని సమ్రక్షింతుము అని అయ్యవారు ఆనతిచ్చిన వాక్యము. భూత భవిష్యద్వర్తమాన కాలాలకున్ను నానా దేశాలకున్ను వ్రాయించినది మూడు లక్షల ముప్పై రెండు వేల గ్రంధము. ఈ గ్రంధమంతా వ్రాయకూడదు. కలుగు మాత్రం వ్రాయించి మీ సమీపానకు పంపించి నాము. మీరు ఈ పత్రిక ప్రత్యేకముగా చదివించుకునేది. ఈ వివరము విని దేవ బ్రహ్మణ విశ్వాసం గలిగి రామ ధర్మజుల మీద భక్తి గలిగి నడిపిస్తిరాయనా ఆ చంద్రస్తాయిగాను సుఖాన ఉందురు. పదో అవతారంబు రామరామాత్మారామంబు. పదకొండో అవతారంబు నేను.

 • శ్రీశైలమందు మల్లికార్జునస్వామి దేవుండు కన్ను దెరచి ప్రజాక్షయం చేసే కొఱకు సంతోషపడుతూ ఉండీని.
 • తూర్పు నాటికి భైరవుని పంపు, దక్షిణ రాజ్యానకు కాళిపంపు, పశ్చిమ రాజ్యానకు ఎర్రుపంపు.
 • ఉత్తరాజ్యానకు దుర్గి పంపు. తురకాణ్యదేశానికి దుర్గిపంపు, కందనవోలు సీమకు ఎర్రు పంపు.
 • నంది మండల సామ్రాజ్యానకు నాగేంద్రుని పంపు. శరణన్నవారిని మా పేరు దలచిన వారిని మరవక కాచి రక్షిస్తూ వచ్చీని.
 • సందు సందు దేశానకు హనుమంతుడు భద్రకాళి వీరభద్రుడు మొదలైన వారి పంపులు.

దుర్జనులు స్వామి ద్రోహులు పరస్త్రీ పరధన హింసకులు మిత్రద్రోహులు క్షుల్లకులు తుచ్ఛకులు కుహకులు విశ్వాస ఘాతుకుల శక్తులు తోడుబోతులు చాడీకాండ్లు దుర్మార్గులు శివద్రోహులు విష్ణుద్రోహులు సంకరజాతులు జిడ్డకులు నిందకులు నాశకులు ద్రోహము చేసేవారిని సంహరింతుము. పంపుల కట్టడి చేసినాము. ప్రభుభ్యాం శూద్రులు నాశనమై పొయ్యేరు. పద్మాక్షుశాపం చేత వేడిమంటల కాలి చచ్చేరు. మా తమ్ముడు భరతునికి గంటలు కట్టించితిరి గనుక శూద్రకులమెల్లా నిర్మూలనం చేస్తిమి. మాశాపానకు దప్పరాదు. బ్రహ్మాస్త్రము తప్పినాగాని మామాట తప్పరాదు. పంచాంగాలు మూలబడును. బ్రహ్మదేవునికి ఆకలిదప్పలు అయ్యేదివసం వచ్చినది. బ్రహ్మదేవునికి సృష్టిపనిలేదు.

 • నాణెము తక్కువ నాణెముగా జూచేరు.
 • ఏమి రారా పోరా అనే మాటలు రావయ్య పోవయ్యా అనేరు.
 • వావివర్తనములు మానేరు.
 • మదమాత్సర్యాలు ఎచ్చి కామక్రోధలోభమోహాలు వచ్చీని.
 • తండోపతండాలైన గాలి చేత వానచేతను పశువులు, గొర్రెలు, అడవి జంతూవులు, మొదలైనవి ప్రాణికోట్లు ఆకాశంబు జూచి అరచీని. ‘మేము పోతూ ఉన్నాము. మాకు ప్రాణాలు లేవు. బ్రతుకులు లేవు’ అని అరచీని.
 • విషపుగాలి చేతను మనుషులు మొదలైన ప్రాణికోట్లు భూమండలమందు నిర్మనుష్యులుగా మడిసేరు.

మామంత్ర శక్తిచేత మాభక్తులైన వారికి పునరుద్ధారణచేసి బ్రతికించుకొని సమ్రక్షించుకునేము. కేశవుని నమ్మిన వారిని నిలిపేము. కేశవకులమంతా నిర్మూలం చేసేము. మా భక్తులైన బ్రహ్మణులు సుఖాన ఉండేరు. మా పాంచాననంవారు సుఖాన ఉండేరు. క్షత్రియులు వేరేకదా, ముత్తరాచు వారిని నిలిపేము. కోమట్లు వేరేకదా, బేరికోమట్లను నిలిపేము. శూద్రులు వేరేకదా, తెలుగు బలిజ వారిని నిలిపేము. ఏకులమందైనా శతాపరాధాలు చేసినాగాని మమ్ము నెర నమ్మిన వారిని కాచి రక్షించేము.

శ్లో: యామ్యాయ యతిమా శ్రేష్ఠా యామ్యాయస్య చింతన

యామ్యాయ సురశ్రేష్ఠా యామ్యా యామ్యామహాన్యథా.

Leave a Reply

Your email address will not be published.