కాలజ్ఞానం


“ద్రావిడు లందున లోకేశ్వరుడు వచ్చి పుట్టీనిమా “

Govinda Vakyam 206

“కమలాలయనుగూడి కమలనాభుండు
రమణీమణిని గూడి రామధర్మజులు
కదలివచ్చెడు జూడ కలికిరూపమున”

Sarvajna Dwipada

శ్లో : ప్లవంగే పంచ గ్రహణే సూర్యాస్తు వలయా కృతిః
తన్మధ్యే విష్ణు రూపస్యాత్తద్భక్తానాం ప్రియా వపమ్
శ్రుతి పీతా భాస్వత్యణూపమా

Subbaraya Kalagnanam

“భువిలో దక్షిన అమెరికా దేశమున భూకంపం బహుగాను బుట్టీనిమా”

Govinda Vakyam 131

“ప్రకటముగ అమెరికా దేశమునందు ప్రజలుంచుకొని పాలించేరుమా”

Govinda Vakyam 136

“వీర వసంతరాయలు పదకొండోయేట బయట వెళ్ళును”

Sarvajna Kalagnanam

“పార్థివో పార్థివో భూపా వ్యయో భూపా క్షయంగతః “

Vidyaranya Kalagnanam

“ఆశ్వయుజ మాస కృష్ణ పక్షమందు పంచాంగము లేక పొయ్యీనిమా
కాల పరిపక్వము జనులకు ముందర కార్తీక మాసమున కలిగీనిమా
బాలచంద్రుని కాంతి కనరాక పొయ్యీని భాను కాంతి లణగి పొయ్యీనిమా”

Govinda Vakyam 279 & 280

“పెళ పెళ నార్చుచు బేతాళ సమితి కదియంగ నుదయించు కపిలునివలన”

Sarvajna Dwipada

చెప్పలేదంటనక పొయ్యేరు నరులార గురుని చేర మ్రొక్కితె బ్రతుకనేర్చేరు|| చెప్పలేదంటనక పొయ్యేరు తప్ప దిదిగో గురునివాక్యము* తప్పుదోవను పోవువారల చప్పరించి మ్రింగే శక్తులు|| మొప్పెతనమున మోసపొయ్యేరు* అదిగాక కొందరు గొప్పతనమున గోసుమీరెరు* ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏవేళనో మరి* గుప్పుగుప్పున దాటిరి యేడు గుర్రపడుగులు ఏరుపడును|| తమ తప్పులు తలచుచున్నారు  తార్కాణమైతే యెక్కువతో దెలియనేర్తురు|| జోకతోడుత తల్లిపిల్లలు జోడు బాసి యడవులందు* కాకిశోకముచెసి ప్రజలు కాయ గసురుల సమలిచత్తురు|| కేక వేసియు ప్రాణమిడిచేరు రాకాసి మూకలు కాకబట్టి కలువరిచేరు* ఆకసాము నెర్రనౌను ఆరు మతము లొక్కటౌను* లోకమందు జనులు అందరు నీరునిప్పున మునిగి పోదురు|| అగలు విడిచి పొగలు దాటేరు* అదిగాక పట్టపగలు చుక్కలు చూచి భ్రమసేరు|| భుగులు భుగులు ధ్వనులు మింటను|| పాతకూలు మంటగలసేరు|| పుణ్యాత్ములైన సాధువులు సంతసించెరు* భుమిమీద ధూముధాములు పుట్టిపెరిగిన* పిమ్మటాను రామరామయనని వారలు రాలిపోదురు తెలిసికొండి|| ఏమొ ఎమో ఎరుగకున్నారు* ఎందెందు జూచిన యముని పురికే నడువమందూరు* భుతలంబున నిట్టి వింతలుపుట్టి యణగిన పిమ్మటాను* నీతి కృతయుగ ధర్మమప్పుడు నిజము నిలకడమీద తెలియును|| ముందు వెనుకలుగానకున్నారు* మూర్ఖులై భువిలో ముందుగతియు నెరుగకున్నారు* కండకోవతో పిన్నపెద్దవి కన్ను గానక గర్వములచే* మందె మేళములాడు వారిని బందుబందుగ గోతురక్కడ|| కీడులైనను కూడనందురు* ఒన గూడినప్పుడు యేడజూచిన వాడు కొందరు. వేడుకతో పోతులూరి వీరభోగ వసంత రాయలు యేడుదీవులు యేకచక్రము నేలునుబ్రహ్మాండమంత||     

కాలఙ్ఞాన తత్త్వము
© కాలఙ్ఞానం